అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొత్తూరు సమీపంలో శారదా నది ఉద్ధృతి కారణంగా పరిసర ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. నది ఒడ్డున ఉన్న ఒక తోటను వరద నీరు పూర్తిగా చుట్టుముట్టింది. ఈ తోటలో ఉన్న భార్య, భర్త, ఇద్దరు పిల్లలు వరద నీటిలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వరద ప్రభావం తగ్గే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.



















