దక్షిణ అండమాన్ సముద్రం మరియు దాని పరిసర ప్రాంతాల్లో, ఆగ్నేయ బంగాళాఖాతంలో సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఈ పరిస్థితుల ప్రభావంతో రేపు (అక్టోబర్ 24, 2025) ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ వ్యవస్థ తదుపరి 24 గంటల్లో పశ్చిమ-ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది.
దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వాతావరణ నిపుణులు మరో 3 నుండి 4 రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మత్స్యకారులు సముద్ర యాత్రలకు వెళ్లరాదని సూచించారు.




















