భారత్, దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొలి మ్యాచ్ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో, రెండో మ్యాచ్ నవంబర్ 22 నుంచి గువాహటిలో జరుగనుంది. టాస్ కోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక బంగారు నాణెంను రూపొందించింది. ఈ నాణెం ఒక వైపు మహాత్మా గాంధీ, మరొక వైపు నల్లజాతి వర్గాల కోసం పోరాడిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా చిత్రాలను ముద్రించింది. శాంతి, స్వేచ్ఛ, అహింసా మార్గంలో నడిచిన వీరు గౌరవార్థం ఈ ప్రత్యేక కాయిన్ రూపొందించబడింది. సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లలో టాస్ కోసం దీన్ని ఉపయోగిస్తామని CAB అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపారు.
2015 నుంచి ఇరుజట్ల టెస్టులను ‘ఫ్రీడమ్ ట్రోఫీ’గా పిలుస్తున్నారు. ఆరేళ్ల తర్వాత ఈడెన్ గార్డెన్స్‌లో టెస్ట్ జరగడం, మొదటి మూడు రోజుల టికెట్లు దాదాపుగా అమ్ముడైందని CAB ట్రెజరర్ సంజయ్ దాస్ తెలిపారు. పిచ్‌ను బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ సమతూకంగా ఉంటే బాగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో దిల్లీలోని ఎర్రకోట సమీపంలో సంభవించిన పేలుడు నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ వద్ద భద్రత చర్యలు కఠినంగా తీసుకుంటున్నారు. ఆటగాళ్ల, ప్రేక్షకుల భద్రత కోసం ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తున్నారు.




















