శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రత్తిపాటి సృజన్ (20) మృతి ఘటనపై తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల ఆవరణలో బైఠాయించి నిరసన చేపట్టారు. సీనియర్ విద్యార్థుల దాడి వల్లే సృజన్ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ, బాధ్యులపై సస్పెన్షన్‌తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సీనియర్ విద్యార్థుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని జూనియర్ విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.



















