దీపావళి
పూర్వం కృతయుగంలో ఒకనాడు బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీమహాలక్ష్మిని లోకశ్రేయస్సు కోసం ప్రార్ధన చేయగా అమ్మ ప్రత్యక్షమై నేను లోక సంచారము చేయటానికి
వెళ్తాను అని ఆశ్వయుజ మాసం అమావాస్య నాడు లోకసంచారమునకు వచ్చింది .
*అమ్మ ఏకకాలంలో లోకమంత నిండిపోయింది. ఏ ఇంటికి వెళ్ళినా స్నానం లేదు, శుచీ శుభ్రత లేదు.
*అలా వెళ్తున్న అమ్మకు కశ్యప ప్రజాపతి గోశాల బాగా నచ్చింది శుచీశుభ్రతతో కళకళలాడుతోంది. అమ్మ లోపలికి అడుగు పెడుతుండగా ఆవులు రావద్దు అన్నాయి.నేను లక్ష్మిని,నా రాకకోసం సమస్త జీవులు కోరుకుంటున్నారు అలాంటిది మీరు వద్దు అంటున్నారు, ఆవులు తిరస్కరించిన దేవతలను నేను ఆదరించను అని శ్రీ మహా విష్ణువు చెప్పారు అని ఆవులతో అన్నది.అమ్మా లక్ష్మీదేవి నీవు చెంచలవు మాకు వేటిమీద కూడా ఆశలేదు కావున అలా అన్నాము తల్లీ అని గోవులు అన్నాయి.
రా అమ్మా ఇంట్లోకి అని ఆహ్వానించి గోవులు సేవించాయి.
అమ్మ ఈరోజున అనగా ఆశ్వయుజ మాసం అమావాస్య (దీపావళి) రోజున ఎవరు సూర్యోదయానికి ముందు ఆవు పేడతో కళ్లాపి చల్లి, గోమూత్రం చల్లి ముగ్గులు వేస్తారో,గోక్షీరంతో పాయసం చేసి నివేదిస్తారో ఆ ఇంటిలో నేను కొలువై ఉంటాను అని అమ్మ వరం ఇచ్చింది.
ఇవి చేయలేని వారు సూర్యోదయానికి ముందు గోమూత్రం చల్లి గొబ్బెమ్మలు పెట్టి గుమ్మడి పూలు వేసి గుమ్మం ముందు ఆవు నెయ్యి దీపారాధన చేసిన ఆ ఇంట కొలువై ఉంటాను అని అమ్మ వరం ఇచ్చింది.
మీ సంప్రదాయములను స్థితిగతులను అనుసరించి వీలు అయినంత వరకు యథా శక్తిగా పూజించండి ఇవి కేవలం సూచనలు మాత్రమే

















