సినిమాల్లో పాత్రల ప్రకారం నటులు కొన్నిసార్లు బరువు పెంచుకోవాల్సి వస్తుంది, మరొకసారి తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిణామాల్లో తారలపై రూమర్స్ కూడా వస్తుంటాయి. ప్రముఖ నటి తమన్నా భాటియా పరిస్థితీ ఇలాగే ఉంది. ఇటీవల ఆమెపై ‘బరువు తగ్గేందుకు ఒజెంపిక్ వంటి ఇంజెక్షన్లు వాడుతున్నారంటూ’ సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. ఇదే విషయాన్ని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించగా, తమన్నా ఇలా స్పందించారు:
“15 ఏళ్ల వయసు నుంచే నేను నటిస్తున్నా, కెమెరాతోనే నా ప్రయాణం సాగుతోంది. దాచే అవసరం ఏమీ లేదు. టీనేజీలో స్లిమ్‌గా ఉన్నా, ఇప్పటికీ అలాగే ఉన్నానని అనుకుంటున్నాను. నాకు కొత్తగా కనిపించడం లేదు. సాధారణంగా మహిళల్లో ప్రతి ఐదేళ్లకు శరీరంలో మార్పులు వస్తుంటాయి. కాబట్టి ఎప్పుడూ ఒకే శరీరాకృతిలో కనిపించడం అసాధ్యం.”
ఈ వ్యాఖ్యలతోనే ఆమెపై వచ్చిన రూమర్స్‌కు చెక్ పెట్టారు.




















