హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవో మరియు ఎన్నికల నోటిఫికేషన్ అమలును హైకోర్టు నిలిపివేసిన స్టేపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిందని సమాచారం. దీనికి సంబంధించి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని కూడా నిర్ణయించబడింది.
రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేసి, ఎన్నికల నిర్వహణకు అనుమతించమని సుప్రీంకోర్టులో వాదించనుంది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైనందున హైకోర్టు జోక్యం తగదు అని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అలాగే, జీవో 9ను అమలు చేయాలని కోరనుంది.
సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కాంగ్రెస్ నేతలు జూమ్ సమావేశం నిర్వహించి, కేసుకు సంబంధించిన వ్యూహాలను చర్చించారు. సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో కూడా ఈ నేపథ్యంలో చర్చించామన్నారు.

















