కర్నూలు సమీపంలో చోటుచేసుకున్న భయానక బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, రహదారులపై భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇలాంటి విషాద సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
గత శుక్రవారం హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు వద్ద బైక్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.


















