తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాల ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. విద్య, నైపుణ్యం, క్రీడలు, పర్యాటకం, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో రూ.వేల కోట్ల పెట్టుబడుల కోసం దాదాపు 90కి పైగా ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే 50 కంపెనీలు ఆసక్తి చూపించాయి.
వాటిలో ప్రధానంగా:
- టీసీఎస్–టీపీజీ ₹70,000 కోట్లు
- హ్యుందయ్ ₹8,000 కోట్లు
- ఫుడ్ లింక్ ₹3,000 కోట్లు
- క్రిస్టల్ లగూన్స్ ₹850 కోట్లు
- అక్విలోన్ నెక్సస్ ₹850 కోట్లు
ఇలా పలు ప్రాజెక్టులు త్వరలో ఒప్పందాల దశకు చేరనున్నాయి.
ఈ నెల 8 మరియు 9 తేదీల్లో జరగనున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” ప్రధాన ఆకర్షణ పెట్టుబడులే.
2047 నాటికి రాష్ట్ర జీఎస్డీపీని $3 ట్రిలియన్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
స్థిరమైన విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, వ్యాపార సౌలభ్యం, ఆవిష్కరణల ప్రోత్సాహం, జీవన ప్రమాణం వంటి అంశాలు తెలంగాణను పెట్టుబడులకు కీలక కేంద్రంగా మారుస్తున్నాయని ఈ సదస్సులో ప్రాధాన్యంగా చర్చించనున్నారు.
పర్యాటకం, ఐటీ, ఔషధ ఉత్పత్తి, ఎలక్ట్రానిక్స్, స్పోర్ట్స్, ఉన్నత విద్య వంటి 20కి పైగా రంగాల్లో ప్రముఖ కంపెనీలతో ఎంవోయూలు కుదరనున్నాయి.
ఫిఫా-ఏఐఎఫ్ఎఫ్ ఫుట్బాల్ అకాడమీ, ఫార్మా రీసెర్చ్ సెంటర్లు, డేటా సెంటర్లు, సినిమా సిటీ, నైట్ సఫారీ, ఎఫ్1 రేసింగ్, స్పోర్ట్స్ సిటీ వంటి కీలక ప్రాజెక్టులు కూడా అమలు కానున్నాయి.


















