మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఎంఎంసీ (మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో 2026 జనవరి 1న ఆయుధాలను వదిలి సాయుధ పోరాటాన్ని ముగిస్తామని పేర్కొన్నారు. ఒక్కొక్కరు బదులుగా కాక, అందరూ ఒకేసారి లొంగిపోతామన్నారు.
మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, హిడ్మా ఎన్‌కౌంటర్ వంటి కారణాల వల్ల పార్టీ బలహీనమైందని, మిగతా స్ధానికులు కేంద్రం విజ్ఞప్తి మేరకు లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
అయితే, ఆయుధాలు ప్రభుత్వానికి అప్పగించి, పునరావాసం కార్యక్రమాన్ని అంగీకరించనున్నారు. మావోయిస్టులు తమకు సహకరించే రాష్ట్రాల్లో సురక్షితంగా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించాలని మావోయిస్టులు కోరారు.
గతవారం కూడా మావోయిస్టులు, ప్రజల మధ్య తిరిగి కలిసే కోసం కొంత సమయం కావాలని లేఖ ద్వారా కోరిన విషయం తెలిసిందే.




















