ఈ సదస్సులో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఆయన తల్లి ఎంతటి స్ఫూర్తిగా నిలిచారో చాగంటి గారు ఈ సందర్భంగా వివరించారు.
చంద్రబాబు గారి తల్లి ఆయనకు స్ఫూర్తి అని, చాగంటి గారు తెలిపారు. “కష్టపడి పనిచేయడం చంద్రబాబు గారి తల్లికి, అలాగే చంద్రబాబు గారికి కూడా చాలా ఇష్టమని” ఆయన పేర్కొన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం అనంతరం, విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ గారు మరియు చాగంటి కోటేశ్వరరావు గారు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చి వారికి దిశానిర్దేశం చేశారు.
చివరిగా, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని మంత్రి నారా లోకేష్ గారు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు గారు (సభాధ్యక్షులు) ప్రత్యేక జ్ఞాపిక, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సదస్సు విద్యార్థులలో విలువలు, నైతికతపై అవగాహన పెంచడానికి దోహదపడింది.



















