మచ్చలేని అందాన్ని పొందాలంటే మార్కెట్లో దొరికే సౌందర్య ఉత్పత్తులకే పరిమితం కావాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో లభించే సహజ పదార్థాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. వాటిలో తులసి ఆకులు ముఖ్యమైనవి అని నిపుణులు చెబుతున్నారు.
మొటిమల సమస్యకు తులసి చిట్కాలు:
⚛ తులసి ఆకులను నీటిలో మరిగించి చల్లారిన తర్వాత ఆ నీటిని టోనర్‌లా ఉపయోగించవచ్చు. ఇది మొటిమలను తగ్గించి, ముఖానికి కాంతిని ఇస్తుంది.
⚛ తులసి పొడిని రోజ్‌వాటర్‌తో కలిపి పేస్ట్‌లా తయారు చేసి ముఖానికి రాసుకుంటే, చర్మ రంధ్రాలు శుభ్రం అవుతాయి. దీని వల్ల మొటిమలు, ఇతర చర్మ సమస్యలు తగ్గుతాయి.
⚛ తులసి రసంలో పుదీనా రసం కలిపి ముఖానికి రాస్తే మొటిమల వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయి.
నల్లమచ్చల నివారణకు తులసి:
ముఖంపై నల్లమచ్చలను తగ్గించడంలో కూడా తులసి ప్రభావవంతంగా పనిచేస్తుంది. తులసి రసానికి సమాన మోతాదులో నిమ్మరసం కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఈ పద్ధతిని ప్రతిరోజూ పాటిస్తే నల్లమచ్చలు తగ్గి చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది.Tools




















