“తల్లిదండ్రులు మనతో ఉంటే మన కలల్ని కూడా కంటారనే” సందేశంతో ‘యుఫోరియా’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్రం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందింది. నీలిమా గుణశేఖర్ నిర్మాతగా వ్యవహరిస్తూ, సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే వారి జీవితంపై ఏమైన ప్రభావం వస్తుందో చూపించే కధాంశాన్ని పరిచయం చేస్తుంది.



















