ఏపీ మంత్రి టీజీ భరత్ రాష్ట్రంలో బస్సు సర్వీసుల విస్తరణ పర్యాటక రంగానికి అభివృద్ధి అవకాశాలను కలిగిస్తుందని పేర్కొన్నారు. కర్నూలు నుంచి విశాఖ వరకు కొత్తగా 3 ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాలు ఎంతో దురదృష్టకరమని అన్నారు. ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ బస్సులో ఉంటే ఈ ప్రాణనష్టం తప్పించుకోవచ్చేమో అని చెప్పారు. బస్సుల భద్రత ప్రమాణాల గురించి ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు తెలిపారు. త్వరలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఈ అంశంపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.




















