కాకరకాయ పేరు వినగానే చాలామంది మొహం చిట్లించుకుంటారు — దాని చేదు రుచి కారణంగానే! చేదు తగ్గించేందుకు ముక్కలను ఉడికించడం, ఉప్పు కలపడం వంటి పద్ధతులు ప్రయత్నించే వారూ ఉన్నారు. అయితే, ఇవి ప్రతిసారి ఫలితమివ్వకపోవడంతో చాలామంది ఈ కూరను దూరం పెడతారు. కానీ నిపుణుల మాటల్లో, కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే కాకర చేదును తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం…
⚛ ముందుగా కాకరకాయపై తొక్కను స్వల్పంగా చెక్కేయాలి. తర్వాత దాన్ని పలుచటి స్లైసులుగా తరిగి రెండు మూడు గంటలు ఎండలో ఉంచాలి. ఇలా చేస్తే కాకరలోని తేమ తగ్గి, సహజంగానే చేదు రుచి కూడా తగ్గుతుంది. ఈ స్లైసులతో కూర వండితే చేదు తక్కువగా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఎండబెట్టడం వల్ల వీటి నిల్వ కాలం కూడా పెరుగుతుంది. ఎండిన ఈ ముక్కలను ఫ్రిజ్‌లో భద్రపరచి తర్వాత కూరల్లో, స్నాక్స్‌లో వాడుకోవచ్చు.




















