బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఒకటిగంట సమయానికి కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతులు కర్లపాలెం గ్రామానికి చెందినవారని, వీరు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ బంధువులని తెలిపారు. ఎమ్మెల్యే కుమారుడి సంగీత్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిసింది.
మృతులను బేతాళం బలరామరాజు (65), బేతాళం లక్ష్మీ (60), గాదిరాజు పుష్పవతి (60), ముదుచారి శ్రీనివాసరాజు (54)గా గుర్తించారు. ఈ విషాద ఘటనతో ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.




















