కర్నూలులో తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సు, ముందున్న వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసం అయింది.
కానీ, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో, బస్సులోని ప్రయాణికులు పెద్ద ఎత్తున ప్రమాదం నుండి తప్పించబడారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడం సంతోషకరంగా ఉంది.



















