దాత చెన్నుపాటి శివనాగేశ్వరరావు పాఠశాలల అభివృద్ధికి సహకారం అందించడం తన లక్ష్యమని తెలిపారు. సోమవారం పెదనందిపాడు మండలం వరగాని ఎస్‌డబ్ల్యూ మాదిరి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం రూ.1 లక్ష సొంత నిధులతో నిర్మించనున్న వంటగది నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శివనాగేశ్వరరావు విద్యార్థుల అవసరాలను గుర్తించి అవసరమైన వనరులు అందిస్తామని పేర్కొన్నారు. ఎంఈవో-1 సీహెచ్ సురేశ్‌బాబు పాఠశాల విద్యార్థులకు సహకారం అందించిన శివనాగేశ్వరరావుకు అభినందనలు తెలిపారు. అనంతరం ఎంఈవో-2 జాకబ్, క్లస్టర్ ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామారావు, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ సంతోషం, తెదేపా నాయకుడు బి.రాంబాబు, వ్యాపారవేత్త ఎన్.పూర్ణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



















