హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మొత్తం 25 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. రూ.300 కోట్ల దాల్ ట్రేడ్ కేసు సంబంధించి హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో సోదాలు జరుగుతున్నాయి.
ఏపీలో గత ప్రభుత్వంలో పలు ట్రేడింగ్ కంపెనీలు భారీగా నగదు లావాదేవీలు చేసినట్లు అధికారులు గుర్తించారు. 2024 ఎన్నికల సమయంలో కూడా భారీ మొత్తంలో నగదు విత్‌డ్రా చేసినట్లు ఐటీ శాఖ నిర్ధారించింది. కొన్ని ట్రేడింగ్ కంపెనీలు పౌరసరఫరాల శాఖ నుంచి అనుమతులు పొందినప్పటికీ పప్పు, దినుసులు సరఫరా చేయకపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి.
గతంలోనూ విశాఖపట్నంలో హిందుస్థాన్ ట్రేడర్స్, కర్నూలులో వీకేర్ గ్రూప్ కంపెనీలపై ఐటీ సోదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి.



















