భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి మరియు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ వీరికి స్వాగతం పలికారు. ప్రపంచకప్ విజయం సాధించినందుకు శ్రీచరణిని సీఎం చంద్రబాబు మరియు లోకేశ్ అభినందించారు.
వరల్డ్ కప్ గెలిచిన ఆనంద క్షణాలను శ్రీచరణి వారితో పంచుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రపంచకప్ విజయంతో టీమ్ ఇండియా తమ ప్రతిభను మరోసారి నిరూపించిందని, మహిళా క్రీడాకారిణులకు శ్రీచరణి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.
అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ ఛైర్మన్ రవినాయుడు కలిసి శ్రీచరణికి ఘన స్వాగతం పలికారు.




















