తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా తుఫాన్ ప్రభావం, సహాయక చర్యల పురోగతిపై వైఎస్ ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రీజనల్ ఇన్‌ఛార్జ్‌లు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఇప్పటికే పార్టీ నేతలు ప్రత్యక్షంగా సందర్శించి పరిస్థితులను వివరించారు. ఆస్తి, పంట నష్టాల వివరాలను వైఎస్ జగన్‌కు అందించారు. ప్రజలతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్న పార్టీ కార్యకర్తల కృషిని వైఎస్ జగన్ ప్రశంసించారు.
ప్రజల పక్కన ఉండి వారికి సహాయం అందించేలా పార్టీ వ్యవస్థను మరింత బలంగా పనిచేయాలని ఆయన నేతలకు సూచించారు. అలాగే, ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను సమర్థవంతంగా కొనసాగించేందుకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు.



















