మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీతను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ (YS Jagan) పట్టించుకోలేదు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగింపుపై జరుగుతున్న వాదనలు నేపథ్యంలో సునీత నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అదే సమయంలో అక్రమాస్తుల కేసు విచారణ కోసం జగన్ కూడా అక్కడికి చేరుకున్నారు. కోర్టు ప్రాంగణంలో సునీతను చూసినా ఆయన పలకరించకుండా అక్కడినుంచి వెళ్లిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన బాధితులు, నిందితులు ఒకేసారి కోర్టులో హాజరైన పరిస్థితి ప్రత్యేకంగా నిలిచింది.




















