అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి. పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి ఒక పేపర్‌గా.. జీవశాస్త్రం మరో పేపర్‌గా విడివిడిగా 50 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని సబ్జెక్టులకు పరీక్షకు పరీక్షకు మధ్య కొంత విరామం వచ్చేలా షెడ్యూల్ ఇచ్చారు.




















