ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు సంభవించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా టెహ్రాన్ స్క్వేర్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనలు చేపడుతున్న సమయంలో ఈ పేలుడు జరిగినట్లు అక్కడి అధికారిక మీడియా తెలిపింది. ఈ ఘటనతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో ఇరాన్‌లోని మరో ముఖ్య నగరం ఖజ్విన్‌లో కూడా భారీ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ పేలుళ్లకు బాధ్యులు ఎవరో ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అయితే ఖజ్విన్, టెహ్రాన్ నగరాల్లో దాడులు జరిపే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ముందుగానే హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఈ ఘటనల మధ్య కూడా వేలాది మంది పౌరులు టెహ్రాన్ వీధుల్లోకి వచ్చి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు కొనసాగించడం గమనార్హం. ప్రజల్లో ఆగ్రహం పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మతి చెడిన నాయకులకు ఇవాళ ఏమి జరుగుతుందో మీరు చూస్తారు” అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. ఇరాన్ నౌకాదళం ఇప్పటికే బలహీనపడిందని, వైమానిక దళం కూడా తీవ్ర నష్టాన్ని చవిచూస్తుందని పేర్కొన్నారు.
ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, డ్రోన్లు ధ్వంసమవుతున్నాయని, వారి నాయకత్వం కూడా కుదేలైందని ట్రంప్ వ్యాఖ్యానించారు. 47 ఏళ్లుగా అమాయక ప్రజలను హింసిస్తున్న నేతలను అమెరికా అంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.ఇటీవల జరిగిన జీ7 దేశాల నేతల వర్చువల్ సమావేశంలో కూడా ట్రంప్ ఇరాన్ త్వరలో లొంగిపోయే అవకాశం ఉందని పేర్కొన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ వ్యాఖ్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















