రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) 14వ సమావేశంలో పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో కీలక పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. గత 13 సమావేశాల్లో రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగ అవకాశాలకు అనుమతి ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 2025లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని, గత ప్రభుత్వంలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ తిరిగి నిలబెట్టామని అన్నారు. టాటా, అదానీ, రిలయెన్స్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయని వెల్లడించారు. విద్యుత్ రంగంలో ఛార్జీలు తగ్గించడం, ప్రజలపై భారం వేయకుండా ప్రభుత్వం భరించడం వల్లే డేటా సెంటర్లు, కొత్త పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. 2026లో కూడా అదే ఉత్సాహంతో వేగవంతమైన గవర్నెన్స్‌తో ఫలితాలు సాధించాలని మంత్రులు, అధికారులకు సూచించారు.



















