అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనుండటం శుభ పరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఆమోదించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంగళసముద్రం, బైరుగణిపల్లె.. చిత్తూరు జిల్లా, పలాస -శ్రీకాకుళం జిల్లా, శాఖమూరు- అమరావతిలో ఈ కొత్త విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు నాణ్యమైన విద్యా అవకాశాలు కల్పించడంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల అవసరాలను తీర్చడంలో ఇవి సహకరిస్తాయన్నారు.




















