టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) లో #GoogleComesToAP, #InvestInAP, #AndhraPradesh, #Visakhapatnam, #Vizag అనే హ్యాష్‌ట్యాగ్‌లు హోరెత్తుతున్నాయి. విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల (దాదాపు ₹1.25 లక్షల కోట్ల) పెట్టుబడితో గిగావాట్-స్కేల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ మంగళవారం ప్రకటించింది.






















