ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం… ఇలా రోజంతా బిజీగా గడిపే మహిళలు చాలాసార్లు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అయితే రోజంతా చురుగ్గా ఉండాలంటే శరీరానికి సరైన పోషకాలు అందడం చాలా ముఖ్యం. శక్తిని పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచే కొన్ని సులభమైన వంటకాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
ఓట్స్ హెల్తీ మిశ్రమం
ఓట్స్, చియా సీడ్స్, పాలు, పెరుగు వంటి పదార్థాలతో తయారయ్యే ఈ వంటకం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
కావలసినవి:
ఓట్స్ – ఒక కప్పు
చియా సీడ్స్ – రెండు చెంచాలు
కాచిన పాలు – పావు కప్పు
చిక్కని పెరుగు – ఒక కప్పు
కీరదోస తురుము – రెండు టేబుల్‌స్పూన్లు
క్యారెట్ తురుము – రెండు టేబుల్‌స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు – ఒక చెంచా
అల్లం తరుగు – అరచెంచా
కరివేపాకు – కొద్దిగా
ఉప్పు – తగినంత
నూనె – రెండు చెంచాలు
ఆవాలు – పావు చెంచా
వేయించిన పల్లీలు – కొద్దిగా
తయారీ విధానం:
ఓ గిన్నెలో పాలు, పెరుగు, ఓట్స్, చియా సీడ్స్, ఉప్పు వేసి కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. మరుసటి రోజు అందులో కీరదోస, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, అల్లం వేసి కలపాలి. తర్వాత నూనెలో ఆవాలు, కరివేపాకు వేయించి తాలింపు వేసి పల్లీలతో అలంకరించాలి.
లాభాలు:
ఈ వంటకం శరీరానికి మాంసకృత్తులు, పీచు, కాల్షియం, ఇనుము వంటి పోషకాలను అందిస్తుంది. అలాగే ప్రొబయోటిక్స్ వల్ల గట్ హెల్త్ మెరుగుపడుతుంది.
పోషక నట్స్ లడ్డూలు
నట్స్, గింజలు, బెల్లంతో తయారయ్యే ఈ లడ్డూలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
కావలసినవి:
పల్లీలు – అరకప్పు
నువ్వులు – అరకప్పు
బాదం – పావు కప్పు
పిస్తా – రెండు టేబుల్‌స్పూన్లు
పొద్దుతిరుగుడు గింజలు – రెండు టేబుల్‌స్పూన్లు
గుమ్మడి గింజలు – రెండు టేబుల్‌స్పూన్లు
ఎండుకొబ్బరి పొడి – అరకప్పు
అంజీర్ – రెండు
ఖర్జూరాలు – రెండు
యాలకుల పొడి – పావు చెంచా
బెల్లం – ఒకటిన్నర కప్పు
తయారీ విధానం:
పల్లీలు, నువ్వులు, బాదం, పిస్తా, గింజలు, ఎండుకొబ్బరి పొడిని విడివిడిగా వేయించాలి. తర్వాత అంజీర్, ఖర్జూర ముక్కలతో కలిసి మిక్సీలో పొడి చేయాలి. కడాయిలో కొద్దిగా నీటితో బెల్లం కరిగించి లేతపాకం వచ్చాక తయారుచేసిన పొడి, యాలకుల పొడి కలపాలి. మిశ్రమం దగ్గరపడిన తర్వాత దించి లడ్డూలుగా చేయాలి.
లాభాలు:
ఈ లడ్డూలలో కాల్షియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, మాంసకృత్తులు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మెదడు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జుట్టు రాలే సమస్యను కూడా తగ్గించడంలో సహాయపడతాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















