మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ (అభయ్) బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఎదుట 60 మంది సహచరులతో కలిసి లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయుధాలను అధికారులకు అప్పగించారు.
తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన వేణుగోపాల్, సాయుధ ఉద్యమంలో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించారు. ఇటీవల పార్టీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పొలిట్‌బ్యూరో నుండి వైదొలిగిన ఆయన, చివరకు ఉద్యమాన్ని పూర్తిగా వీడారు.
గడ్చిరోలి పోలీసులు ఆయనపై రూ.6 కోట్ల బహుమతి ప్రకటించారు. ఈ లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.




















