ఏపీ మంత్రి నారా లోకేశ్ ఈ నెల 19 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. అక్కడి ప్రముఖ వర్సిటీలలో బోధనా పద్ధతులను అధ్యయనం చేయగా, CII భాగస్వామ్య సదస్సు విజయవంతం కోసం రోడ్ షోలు నిర్వహించనున్నారు.
విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సదస్సులో దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి పారిశ్రామికవేత్తలు, పాలసీ రూపకర్తలు, విద్యావేత్తలు పాల్గొంటారు.



















