దీపావళి 2025 శుభాకాంక్షలు : నరకచతుర్ద విశిష్టత.
దీపావళి పండుగకు సంబంధించిన కథ పురాణాల్లో చక్కగా వివరించబడింది. నరకాసురుడు భూదేవి మరియు వరాహ స్వామికి జన్మించాడు. అతడు తల్లి చేతిలోనే మరణించాలనే వరం కోరుకున్నాడు. ఆ వరంతో అహంకారం పెరిగి, మూడు లోకాలకూ కష్టాలు తెచ్చాడు. దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా, ఆయన శ్రీకృష్ణుడిగా జన్మించి, భూదేవి సత్యభామ రూపంలో నరకాసురుని సంహరించారు.
ఈ సంఘటన జరిగిన రోజునే నరకచతుర్దశి అని పిలుస్తారు. ఆ ఆనందంలో ప్రజలు తమ ఇళ్లలో దీపాలు వెలిగించి, పండుగ జరుపుకుంటారు. అలాగే త్రేతాయుగంలో శ్రీరాముని రావణ సంహారం తరువాత అయోధ్య ప్రజలు దీపాలు వెలిగించి అతనికి ఘన స్వాగతం పలికారు. అప్పటినుండి దీపావళి పండుగను యుగయుగాలుగా జరుపుకుంటున్నారు.
ఈ ఏడాది 2025 అక్టోబర్ 20, సోమవారం నాడు దీపావళి పండుగ వస్తోంది. ఇదే రోజున సూర్యోదయానికి చతుర్దశి, సూర్యాస్తమయానికి అమావాస్య ఉన్నందున నరకచతుర్దశి కూడా ఇదే రోజు జరుపుకుంటారు.
ఈ వెలుగుల పండుగ సందర్భంగా, మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలపడానికి పావనమైన శ్లోకాలతో పంచుకోండి!
ఓం మహాదేవ్యేచ విద్మహే
విష్ణు పత్నేచ దీమహే…
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోఽస్తు తే ||
దీపావళి శుభాకాంక్షలు
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ||
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
పరిష్కృత స్థాపిత రత్నదీపే జ్యోతిర్మయీం ప్రజ్జ్వలయామి దేవీమ్ |
నమామ్యహం మత్కులవృద్ధిదాత్రీం సౌదాది సర్వాంగణ శోభమానామ్ ||
దీపావళి శుభాకాంక్షలు
భో దీప బ్రహ్మరూపస్త్వం జ్యోతిషాం ప్రభురవ్యయః |
ఆరోగ్యం దేహి పుత్రాంశ్చ అవైధవ్యం ప్రయచ్ఛ మే ||
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
శరీరారోగ్యమైశ్వర్యం అరిపక్షక్షయః సుఖమ్ |
దేవి త్వద్దృష్టిదృష్టానాం పురుషాణాం న దుర్లభమ్ ||
దీపావళి శుభాకాంక్షలు
దీపస్త్వమేవ జగతాం దయితా రుచిస్తే
దీర్ఘం తమః ప్రతినివృత్యమితం యువాభ్యామ్ |
స్తవ్యం స్తవప్రియమతః శరణోక్తివశ్యం
స్తోతుం భవంతమభిలష్యతి జంతురేషః ||
దీపావళి శుభాకాంక్షలు
శుభం భవతు కళ్యాణీ ఆయురారోగ్యసంపదామ్ |
మమ శత్రువినాశాయ దీపలక్ష్మి నమోఽస్తు తే ||
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి |
యోగజే యోగసంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ||
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం దీపావళి వేళ మీ ఇంట వెల్లివిరియాలి
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
ఒక్కో దీపాన్ని వెలిగిస్తూ చీకటిని తరిమేసినట్టు..
మీ జీవితంలో ఒక్కోమార్పుని ఆహ్వానిస్తూ కొత్త జీవీతానికి ఆహ్వానం పలకండి
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మీకు అష్ట ఐశ్వర్యాలను సుఖ సంతోషాలు అందించాలి
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
దీపాల వెలుగులా మీ ప్రేమ వ్యాప్తి చెందాలి
తొలగిపోయే చీకటిలా ద్వేషం నశించిపోవాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
చీకట్లను చెరిపివేసే ఈ దీపావళి మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకురావాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు



















