శబరిమల క్షేత్ర విశిష్టతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. శబరిమల యాత్రలో ఏపీ అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ శబరిమల పరిరక్షణకు భక్తులంతా ఐక్యంగా ముందుకు రావాలని అన్నారు. క్షేత్రానికి సంబంధించిన అంశాలపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతోందని, ఇందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. శబరిమలలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని కోరారు.
శబరిమలలో భక్తులకు మెరుగైన నిర్వహణ, సౌకర్యాలు అందించేందుకు టీటీడీ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని మాధవ్ సూచించారు. వచ్చే ఏడాదిలోపు అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ మాట్లాడుతూ కేరళలో అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాను కూడా ప్రత్యక్షంగా అనుభవించానని తెలిపారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.కార్యక్రమంలో తాళ్లాయపాలెం పీఠాధిపతి శివస్వామితో పాటు పలువురు స్వామీజీలు, పీఠాధిపతులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















