ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తీక పురాణం 4వ అధ్యాయము – దీపారాధనా మహిమ

October 24, 2025
in Devotional News
0
కార్తీక పురాణం 4వ అధ్యాయము – దీపారాధనా మహిమ
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతముయొక్క మహిమవల్ల బ్రహ్మరాక్షస జన్మనుండి కూడా విముక్తినొందెదరని చెప్పుచుండగా జనకుడు ‘మాహాతపస్వీ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలదీ తనివితీరకున్నది.కార్తీకమాసములో ముఖ్యముగా యేమేమి చేయవలయునో, యెవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు’ అని కోరగా వశిష్ఠులవారు యిట్లు చెప్పదొడగిరి.
జనకా! కార్తీక మాసమందు సర్వసత్కార్యములునూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము. దీనివలన మిగుల ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము, శివాలయమునగాని విష్ణ్యాలయము నందుగాని దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారంబునందుగాని దీపముంచినవారు సర్వపాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరినూనెతోగాని, అవిసె నూనెతో గాని, విప్పనూనెతో గాని, యేదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను. దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యాత్ములుగాను, భక్తిపరులుగాను నగుటయేగాక అష్టయిశ్వర్యములూ కలిగి శివసన్నిధి కేగుదురు. ఇందు కొకకథ గలదు, వినుము.

శతృజిత్కథ:
పూర్వము పాంచాలదేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి, తుదకు విసుగుజెంది గోదావరీ తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, “పాంచాల రాజా! నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీకోరికయేమి?” యని ప్రశ్నించగా, “ఋషిపుంగవా! నాకు అష్టయిశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నా వంశము నిల్పుటకు పుత్రసంతానము లేక, కృంగి కృశించి యీ తీర్థస్థానమున తపమాచరించు చున్నాను” అని చెప్పెను. అంత మునిపుంగవుడు “ఓయీ! కార్తీకమాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతికొరకు దీపారాధనము చేసినయడల నీ కోరిక నెరవేరగలదు” యని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాల రాజు తనదేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీకమాసము నెలరోజులూ దీపరాధన చేయించి, దానధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు, విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్యకార్యము వలన నారాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభముహూర్తమున నొకకుమారుని గనెను. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్మములుచేసి, ఆ బాలునకు ‘శత్రుజి’ యని నామకరణము చేయించి అమిత గారాబముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్రసంతానము కలిగినందు వలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీకమాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్థమానుడగుచు సకలశాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని, యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లిదండ్రుల గారాబముచేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు, యెదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను.తల్లిదండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచీ చూడనట్లు – వినీవిననట్లు వుండిరి. శతృజి ఆరాజ్యములో తన కార్యములకు అడ్డుచెప్పువారలను నరుకుదునని కత్తిపట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొకదినమున నొక బ్రాహ్మణపడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య. మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మథునకైననూ శక్యముగాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మవలె నిశ్చేష్టుడై కామవికారములో నామెను సమీపించి తన కామవాంఛ తెలియచేసెను. ఆమె కూడా నాతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యిపట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగముల ననుభవించెను. ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతిదినము నర్థరాత్రివేళ ఒక అజ్ఞాతస్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలము జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి, భార్యనూ, రాజకుమారునీ ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని, యెవరికివారు రహస్యమార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను. ఆ కాముకులిద్దరునూ గుడిలో కలుసుకొని గాఢాలింగన మొనర్చుకొను సమయమున “చీకటిగా వున్నది, దీపముండిన బాగుండును గదా,” యని రాకుమారుడనగా, ఆమె తన పైటచెంగును చించి అక్కడనున్న ఆముదపుప్రమిదలో ముంచి దీపము వెలిగించెను.తర్వాత వారిరువురునూ మహానందముతో రతిక్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదునుగా నామెభర్త తన మొలనున్న కత్తితీసి ఒక్క వ్రేటుతో తన భార్యనూ, ఆ రాజకుమారునీ ఖండించి తానుకూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలదీ ఆరోజు కార్తీక సుద్ధ పౌర్ణమి, సోమవారమగుటవలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుటవలననూ శివదూతలు ప్రేమికులిరువురినీ తీసుకొనిపోవుటకునూ – యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకునూ అక్కడకు వచ్చిరి.
అంత యా దూతలను చూచి బ్రాహ్మణుడు “ఓ దూతలారా! నన్ను తీసుకొని వెళ్లుటకు మీరేల వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారులకొరకు శివదూతలు విమానములో వచ్చుటేల? చిత్రముగా నున్నదే!” అని ప్రశ్నించెను.
అంత యమకింకరులు “ఓ బాపడా! వారెంతటి నీచులైననూ, యీ పవిత్రదినమున, అనగా కార్తీకపౌర్ణమీ సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుటవలన అప్పటివరకూ వారు చేసిన పాపముల్న్నియును నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివదూతలు వచ్చినారు” అని చెప్పగా – యీ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు “అలా యెన్నటికినీ జరుగనివ్వను. తప్పొప్పులు యేలాగున్నప్పటికినీ మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి.
కనుక ఆ ఫలము మాయందరికీ వర్తించవలసినదే” అని, తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమాన మెక్కించి శివసాన్నిధ్యమునకు జేర్చిరి.వింటివా రాజా! శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక, కైలాసప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తీక మాసములో నక్షత్రమాల యందు దీపముంచినవారు జన్మరాహిత్యమొందుదురు. ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి నాలుగో యధ్యాయము
నాల్గవ రోజు పారాయణము సమాప్తము. దానముచేయువారు చెప్పవలసిన మంత్రము
ఓం ఇదం ఏతత్ అముకం (ఒమిటి చిట్టా రోధనాత్ – ఇద మేతత్ దారయిత్వా ఏత దితి ద్రుష్ట యామాస అముకమితి వస్తు నిర్దేశన – మితి (స్మార్తం) అద్య రీత్యా ( రీతినా) (అద్యయితి దేశకాలమాన వ్రుత్యాది సంకల్పం రీత్యేతి ఉద్దేశ్యయత్ ) విసర్జయేత్ (అని – ప్రాచ్యం)దదామి (అని వీనం) ఎవరికీ తోచిన శబ్దం వారు చెప్పుకోనవచ్చును.
దానము తీసుకోనువారు చెప్పవలసిన మంత్రం
(దానం చేసేటప్పుడు, ఆ దానాని పరిగ్రహించే వ్యక్తి ఈ దిగువ విషయాలను స్మరిస్తూ దానం తీసుకోవాలి).
ఓం ………… ఏతత్ ……………. ఇదం
( ఓమితి చిత్త నిరోధనస్యాత్ – ఏటదితి కర్మణ్యే – ఇద్మిటి కృత్య మిర్ధాత్) అముకం –
(స్వకీయ ప్రవర చెప్పుకోనవలెను).
అద్యరీత్యా – దేశకాలమాన పరిస్థితి రీత్యా సంకల్పం చెప్పుకొని – దాత్రు సర్వపాప అనౌచిత్య ప్రవర్త నాదిక సమస్త దుష్ఫల వినాశనార్ధం అహంభో (పునః ప్రవర చెప్పుకొని) – ఇదం అముకం దానం గృహ్ణామి ……….. (ఇద మితి ద్రుష్ట్య్వన, అముక్మిటి వస్తు నిర్దేశాది త్యా దయః) అని చెప్పుకోనుచూ ‘ పరిగ్రుహ్ణామి లేదా ‘ స్వీ గ్రుహ్ణామి అని అనుచూ స్వీకరించాలి.
శ్రీ శివ స్తోత్రం
శ్లో || వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగ ధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియంవందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం ||
శ్రీ విష్ణు సోత్రం
శ్లో || శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘ వర్ణం శుభాంగం
లక్ష్మీ కాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం
వందేవిష్ణుం భవభయ హారం సర్వలోకైక నాథం |

ShareTweetSend
Previous Post

దుబాయ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం – యూఏఈతో వాణిజ్య, సాంకేతిక, పెట్టుబడి అంశాలపై చర్చ

Next Post

యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రితో ముఖ్యమంత్రి సమావేశం

Related Posts

స్వర్ణ తేరు దివ్య తేజస్సు.. మలయప్ప స్వామి భవ్య దర్శనం
Devotional News

స్వర్ణ తేరు దివ్య తేజస్సు.. మలయప్ప స్వామి భవ్య దర్శనం

September 21, 2026
తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు రద్దు.. 24 వరకు పొడిగింపు
Devotional News

తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు రద్దు.. 24 వరకు పొడిగింపు

September 21, 2026
రూ.4.50 కోట్ల కరెన్సీ నోట్లతో గణేశుడికి అలంకరణ.. నందిగామలో ప్రత్యేక ఆకర్షణ
Devotional News

రూ.4.50 కోట్ల కరెన్సీ నోట్లతో గణేశుడికి అలంకరణ.. నందిగామలో ప్రత్యేక ఆకర్షణ

September 21, 2026
గరుడ సేవ కోసం తిరుమలకు చేరిన 9 ప్రత్యేక గొడుగులు
Devotional News

గరుడ సేవ కోసం తిరుమలకు చేరిన 9 ప్రత్యేక గొడుగులు

September 18, 2026
కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప
Devotional News

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

September 18, 2026
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం
Devotional News

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం

September 17, 2026
Next Post
యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రితో ముఖ్యమంత్రి సమావేశం

యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రితో ముఖ్యమంత్రి సమావేశం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 22, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 22, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
22 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం: 22 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 22, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఒక్క పరుగు తేడాతో ఓటమి.. అమరావతి ఈ ఛాంపియన్స్‌కు షాక్

ఒక్క పరుగు తేడాతో ఓటమి.. అమరావతి ఈ ఛాంపియన్స్‌కు షాక్

September 22, 2026
13 ఏళ్లకే రెండు స్వర్ణాలు.. ఆసియా క్రీడల్లో సంచలనం సృష్టిస్తున్న యు జిడి

13 ఏళ్లకే రెండు స్వర్ణాలు.. ఆసియా క్రీడల్లో సంచలనం సృష్టిస్తున్న యు జిడి

September 22, 2026
జపాన్‌పై భారత్‌ సంచలన విజయం.. 200వ టీ20 గెలుపు

జపాన్‌పై భారత్‌ సంచలన విజయం.. 200వ టీ20 గెలుపు

September 22, 2026
యూపీఐ ఎండీఆర్‌పై జీఎస్టీ.. చిన్న వ్యాపారులకు భారం లేదు: ఎన్‌పీసీఐ

యూపీఐ ఎండీఆర్‌పై జీఎస్టీ.. చిన్న వ్యాపారులకు భారం లేదు: ఎన్‌పీసీఐ

September 22, 2026

Recent News

ఒక్క పరుగు తేడాతో ఓటమి.. అమరావతి ఈ ఛాంపియన్స్‌కు షాక్

ఒక్క పరుగు తేడాతో ఓటమి.. అమరావతి ఈ ఛాంపియన్స్‌కు షాక్

September 22, 2026
13 ఏళ్లకే రెండు స్వర్ణాలు.. ఆసియా క్రీడల్లో సంచలనం సృష్టిస్తున్న యు జిడి

13 ఏళ్లకే రెండు స్వర్ణాలు.. ఆసియా క్రీడల్లో సంచలనం సృష్టిస్తున్న యు జిడి

September 22, 2026
జపాన్‌పై భారత్‌ సంచలన విజయం.. 200వ టీ20 గెలుపు

జపాన్‌పై భారత్‌ సంచలన విజయం.. 200వ టీ20 గెలుపు

September 22, 2026
యూపీఐ ఎండీఆర్‌పై జీఎస్టీ.. చిన్న వ్యాపారులకు భారం లేదు: ఎన్‌పీసీఐ

యూపీఐ ఎండీఆర్‌పై జీఎస్టీ.. చిన్న వ్యాపారులకు భారం లేదు: ఎన్‌పీసీఐ

September 22, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఒక్క పరుగు తేడాతో ఓటమి.. అమరావతి ఈ ఛాంపియన్స్‌కు షాక్

ఒక్క పరుగు తేడాతో ఓటమి.. అమరావతి ఈ ఛాంపియన్స్‌కు షాక్

September 22, 2026
13 ఏళ్లకే రెండు స్వర్ణాలు.. ఆసియా క్రీడల్లో సంచలనం సృష్టిస్తున్న యు జిడి

13 ఏళ్లకే రెండు స్వర్ణాలు.. ఆసియా క్రీడల్లో సంచలనం సృష్టిస్తున్న యు జిడి

September 22, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.