మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్)లో అమరావతి ఈ ఛాంపియన్స్ జోరుకు బ్రేక్ పడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన అమరావతి.. గోదావరి గోల్డెన్ ఈగల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. పుష్పిత అర్ధశతకంతో మెరవగా.. హెర్నీటా ఫ్లెవియా పెరీరా కీలక పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో అమరావతి చివరి వరకు పోరాడింది. దేవిక 63 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినా.. జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయింది. దీక్ష, రంగలక్ష్మి కూడా తమ వంతు సహకారం అందించారు. అయితే గోదావరి బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి మ్యాచ్‌ను తమ వైపు తిప్పారు. చివరకు అమరావతి 20 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటై ఒక్క పరుగు తేడాతో ఓడింది. గోదావరికి ఇది టోర్నీలో రెండో విజయం.
డబ్ల్యూఏపీఎల్‌లో వైజాగ్ ఫైర్‌బర్డ్స్ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. రాయలసీమ జెన్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో ఓడింది. తొలుత రాయలసీమ 7 వికెట్లకు 174 పరుగులు చేసింది. గ్రీష్మ సైని 70 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ పద్మజ, వాసవి పావని కూడా కీలక పరుగులు చేశారు.
174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైజాగ్ ఫైర్‌బర్డ్స్ 7 వికెట్లకు 152 పరుగులకే పరిమితమైంది. పుష్పలత 48, హాసిని చౌదరి 35 పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. బౌలింగ్‌లోనూ రాణించిన పద్మజ రాయలసీమ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ విజయంతో రాయలసీమ టోర్నీలో రెండో గెలుపును నమోదు చేసుకోగా.. ఇప్పటివరకు గెలుపు ఖాతా తెరవని జట్టుగా వైజాగ్ కొనసాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















