కోడూరు: మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాల పరిస్థితిని ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. కృష్ణా జిల్లా కోడూరులో పర్యటించిన ఆయన, వరదల కారణంగా నష్టపోయిన రైతులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి పంట నష్టం వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.




















