అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సమావేశంలో నైపుణ్యం పోర్టల్, జాబ్ డ్యాష్‌బోర్డ్, మరియు వివిధ శిక్షణ కోర్సుల పురోగతిపై విస్తృతంగా చర్చించారు. అభ్యర్థులు తమ ప్రొఫైల్‌ను మెరుగుపరచుకునేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రెజ్యూమ్ రూపొందించుకునే సౌకర్యాన్ని నైపుణ్యం పోర్టల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ యువతకు అనుగుణంగా నైపుణ్య శిక్షణలు అందించి, పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు వారిని తీర్చిదిద్దాలని సూచించారు.



















