నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద తుపాను ప్రభావంతో ఉధృతంగా వచ్చిన వరద నీటిలో భారీ బోటు కొట్టుకువచ్చి బ్యారేజీకి తగిలే ప్రమాదం ఏర్పడింది. అయితే అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి, ఆ బోటును చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు. వెంటనే యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సంగం బ్యారేజీని రక్షించడంలో అధికారులు చూపిన వేగం, సమన్వయానికి స్థానికులు అభినందనలు తెలిపారు. తుపాను పరిస్థితుల్లో కూడా ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న అధికారులు ప్రశంసనీయమని వారు పేర్కొన్నారు.



















