గుంటూరులో అధికారుల వ్యవహార శైలిపై ఎమ్మెల్యే గల్లా మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారని ఆమె విమర్శించారు. అధికారులు “విభజించి పాలించు” తత్వాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో కూటమి ముఖ్య నేతల ఫోటోలు లేకపోవడం ఉద్దేశపూర్వకమని గల్లా మాధవి ఆరోపించారు. నేతల మధ్య విభేదాలు సృష్టించడం అధికారుల ధోరణిగా మారిందని వ్యాఖ్యానించారు. ఇది అవగాహన రాహిత్యమా, లేక అహంకారమా అనే ప్రశ్నను ఆమె లేవనెత్తారు.
కూటమి ప్రభుత్వాన్ని అధికారులు పూర్తిగా అంగీకరించడం లేదా అనే అనుమానం కలుగుతోందని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు.




















