ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘భూమి నుంచి భవిష్యత్తు వరకు’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు.
విజయనగరం కోట వద్ద ప్రారంభమైన భారీ వాహన ర్యాలీ భోగాపురం విమానాశ్రయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందని అన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్లెడ్జ్‌వాల్‌పై సంతకాలు చేశారు. విమానాశ్రయ ప్రారంభానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను ప్రదర్శించే డిజిటల్ టైమర్ వాల్‌ను ఆవిష్కరించారు. సెల్ఫీ పాయింట్ వద్ద పలువురు ఉత్సాహంగా ఫొటోలు దిగారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, జేసీ సేధు మాధవన్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















