ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల ఆస్తులను అటాచ్ చేయడానికి ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 111 మరియు 126 జీవోల ద్వారా నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు సిట్ 11 మంది నిందితులపై వారెంట్లు జారీ చేయడానికి సిద్ధమవుతోంది. ఇదే కేసులో చెన్నై ఐజీ రిజిస్ట్రేషన్‌కి సిట్ అడిగిన ఆస్తుల వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశించింది. సిట్ లేఖ రాసినా, చెన్నై రిజిస్ట్రేషన్ ఐజీ వివరాలు ఇవ్వలేదని సిట్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన ఏసీబీ కోర్టు, ఆ వివరాలను తక్షణమే అందజేయాలని ఆదేశించింది.
ఈ ఆదేశాలతో లిక్కర్ స్కాం విచారణలో కొత్త దశ మొదలైంది.



















