నవీపేట, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ శివారులో ఒక గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు బాసర ప్రధాన రహదారి పక్కన మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మృతదేహానికి తల లేదు మరియు చేతుల వేళ్లు సగం వరకు కత్తిరించబడ్డాయి. పోలీసుల అంచనాల ప్రకారం, మృతి చెందిన మహిళ వయసు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండవచ్చును. మృతదేహం వివస్త్రంగా ఉండటంతో, అత్యాచారం తర్వాత హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరో ప్రాంతంలో హత్య చేసి, ఇక్కడ మృతదేహాన్ని పారేశారని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సంగటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించిన కేసు పోలీసు విభాగం నమోదు చేసి, పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




















