లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి కలిశారు. ఈ భేటీలో యూకేలోని వివిధ విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్తో నాలుగు విభిన్న రంగాల్లో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశంపై చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసే అంశం కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చింది. అలాగే, వర్సిటీల మధ్య విద్యార్థుల మార్పిడి (ఎక్స్చేంజ్) కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు విక్రమ్ దొరైస్వామితో మాట్లాడారు.



















