ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తీక పురాణం- 14వ అధ్యాయము

November 4, 2025
in Devotional News
0
కార్తీక పురాణం- 14వ అధ్యాయము
Share on FacebookShare on TwitterShare on Whatsapp

(ఆబోతును అచ్చుబోసి వదులుట (వృషోత్సర్గము) )
వశిష్ఠుల వారు, జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మాహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి. ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానముచేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానముచేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింప జేసుకొందురు. వారికి కోటియాగముల చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలును తమ వంశమం దెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదలునో అని ఎదురుజూచుచుందురు. ఎవడు ధనవంతుడై యుండి పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియైననూ చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడానరకమునకుగురిచేయును. కావున ప్రతిసంవత్సరం కార్తీక మాసమున తనశక్తికొలది దానము చేసి నిష్టతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధనచేసి ఆరాత్రియంతయు జాగరముండి మరునాడు తమశక్తి కొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములననుభవింతురు.

కార్తీకమాసములో విసర్జింపవలసినవి

         ఈ మాసమందు పరాన్న భక్షన చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు. తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారమునాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందున భోజనం చేయరాదు.  కార్తీకమాసమున నెలరోజులూ కూడా కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విస్మరించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున, వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ, గోదావరీ సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. అటుల చేయనియెడల మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున బడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతిదగ్గరగాని, చెరువునందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.

శ్లో!! గంగే యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదా సింధు కావేరీ జలేస్మిన్‌ సన్నిధింకురు!!
అని పై తెలిపున శ్లోకం పఠించుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను. సాయం కాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలెను.
కార్తీక మాస శివపూజాకల్పము

  1. ఓం శివాయ నమః – ధ్యానం సమర్పయామి
  2. ఓం పరమేశ్వరాయ నమః – ఆవాహనం సమర్పయామి
  3. ఓం కైలాసవాసాయ నమః – నవరత్నసింహాసనం సమర్పయామి
  4. ఓం గౌరీనాథాయ నమః – పాద్యం సమర్పయామి
  5. ఓం లోకేశ్వరానమః – ఆర్ఘ్యం సమర్పయామి
  6. ఓం వృషభవాహనాయనమః – స్నానం సమర్పయామి
  7. ఓం దిగంబరాయ నమః – వస్త్రం సమర్పయామి
  8. ఓం జగన్నాథాయనమః – యజ్ఞోపవీతం సమర్పయామి
  9. ఓం కపాలధారిణే నమః – గంధం సమర్పయామి
  10. ఓం సంపూర్ణ గుణాయనమః – పుష్పం సమర్పయామి
  11. ఓం మహేశ్వరాయ నమః – అక్షతాన్‌ సమర్పయామి
  12. ఓం పార్వతీనాథాయ నమః – ధూపం సమర్పయామి
  13. ఓం తేజోరూపాయ నమః – దీపం సమర్పయామి
  14. ఓం లోకరక్షాయ నమః – నైవేద్యం సమర్పయామి
  15. ఓం త్రిలోచనాయ నమః – కర్పూర నీరాజనం సమర్పయామి
  16. ఓం శంకరాయనమః – సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
  17. ఓం భవాయనమః – ప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి
    ఈప్రకారముగా కార్తీకమాసమంతయు పూజించవలెను. శివసన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసినయెడల ధన్యుడగును. పూజానంతరము తనశక్తినిబట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము, వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీకమాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన, తులసికోటవద్ద కర్పూర హారతులతో దీపారధన చేసిన ఎడల, వారికీ, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండికూడా యీ వ్రతము నాచరించనివారు వంద జన్మలు నానాయోనులందునా జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, యెలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోకతముగా ఆచరించిన యెడల పదిహేను జన్మలయొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును.

పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము…

ShareTweetSend
Previous Post

పిల్లల సమక్షంలో ఇలా చేయడం మంచిది కాదట!

Next Post

భారత హైకమిషనర్‌ సీఎం చంద్రబాబును కలిశారు.

Related Posts

తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు
Devotional News

తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

August 4, 2026
శిర్డీ సాయికి దుబాయ్‌ భక్తుల బంగారు కానుక
Devotional News

శిర్డీ సాయికి దుబాయ్‌ భక్తుల బంగారు కానుక

August 4, 2026
వైభవంగా ముగిసిన ఉజ్జయిని మహాకాళి బోనాలు
Devotional News

వైభవంగా ముగిసిన ఉజ్జయిని మహాకాళి బోనాలు

August 4, 2026
మహంకాళి అమ్మవారికి మహా మంగళహారతి
Devotional News

మహంకాళి అమ్మవారికి మహా మంగళహారతి

August 3, 2026
దుర్గమ్మ కొండపై ఆధునిక సౌకర్యాలు.. రోప్‌వేకు కూడా ప్రతిపాదన
Devotional News

దుర్గమ్మ కొండపై ఆధునిక సౌకర్యాలు.. రోప్‌వేకు కూడా ప్రతిపాదన

August 1, 2026
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
Devotional News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

July 31, 2026
Next Post
భారత హైకమిషనర్‌ సీఎం చంద్రబాబును కలిశారు.

భారత హైకమిషనర్‌ సీఎం చంద్రబాబును కలిశారు.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 03 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 04 ఆగస్టు 2026 (మంగళవారం)

August 4, 2026
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

October 3, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

August 4, 2026
బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

August 4, 2026
తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

August 4, 2026
శిర్డీ సాయికి దుబాయ్‌ భక్తుల బంగారు కానుక

శిర్డీ సాయికి దుబాయ్‌ భక్తుల బంగారు కానుక

August 4, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

August 4, 2026
బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

August 4, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.