ఆహారం, సరైన వాతావరణం, సంతానోత్పత్తికి అనువైన పరిస్థితులు కోసం దేశీ-విదేశీ పక్షులు వలస వస్తుంటాయి. కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి, ఇష్టమైన ప్రదేశంలో కొన్ని రోజుల పాటు నివాసం ఏర్పరిచుకుంటాయి. ఎక్కువగా ఉత్తర ప్రాంతాల నుంచి దక్షిణానికి, లేదా దక్షిణ ప్రాంతాల నుంచి ఉత్తరానికి వెళ్ళే ఈ వలస పక్షులు ఎక్కువగా శీతాకాలంలో కనిపిస్తాయి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తెలుగు భూభాగంలో విహరించి, ఫిబ్రవరి చివరికి తిరిగి తమ స్వస్థలాలకు వెళ్తాయి. అయితే ఈసారి ఈ పక్షులు ముందుగానే వచ్చి ప్రకృతిలో విహరిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వీటి సాయంత్రపు సంచారం ఎక్కువగా కనిపిస్తోంది. హనుమకొండకు చెందిన వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ వలస పక్షుల ఫోటోల్ని క్యాచ్ చేశారు. మన దేశంలోని మంచినీటి తడి భూముల్లో ఈ నల్ల బాతు సంచరిస్తుంది. దీన్ని స్పాట్ బిల్ డక్ లేదా అనాస్ పోసిలోర్‌హో అని పిలుస్తారు. ముక్కుపై పసుపు, ఆరింజ రంగులు ప్రత్యేకత చూపిస్తాయి. నారింజ రంగు కాళ్లు, పాలిపోయినట్లుగా తల ఉండడం, అలాగే పాకాల, భీమునిపాదం, ధర్మసాగర్, రామప్ప వంటి సరస్సు తీరాల్లో వీటి కనిపించడం గమనార్హం.
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy. I Agree