భారత క్రికెటర్ శ్రీచరణి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), షాప్ అధికారులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మహిళా వన్డే వరల్డ్ కప్‌లో టీమ్‌ఇండియా విజేతగా నిలచిన జట్టుకు శ్రీచరణి ప్రాతినిధ్యం వహించి ప్రతిభ చూపిన సంగతి తెలిసిందే. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఆమె విజయవాడకు బయలుదేరి, త్వరలో సీఎం చంద్రబాబు మరియు మంత్రి లోకేశ్‌ను కలవనున్నారు.



















