రంగారెడ్డి జిల్లా బాలాపూర్ ఠాణా పరిధిలో ఓ వైద్యుడు మత్తు ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన మొహ్మద్ ఇమాయతుల్లా కుమారుడు ఖాసిం (27) పాతబస్తీలోని యాకుత్‌పురలో నివాసముంటూ, నిజామియా యునానీ కళాశాలలో విద్యనభ్యసించారు.
గత రెండు నెలలుగా మల్లాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రాత్రి విధుల్లో వైద్యుడిగా పనిచేస్తున్న ఆయన సోమవారం రాత్రి విశ్రాంతి కోసం తన గదికి వెళ్లి తలుపులు మూసుకున్నారు. కొంతసేపటికి ఆయన బయటకు రాకపోవడంతో అనుమానం కలిగిన ఆసుపత్రి సిబ్బంది తలుపులు కొట్టినా స్పందన లేకపోవడంతో తలుపులు విరగ్గొట్టారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. తన కుమారుడు నిద్రలేమితో బాధపడేవాడని, నిద్ర కోసం మాత్రలతో పాటు మత్తు ఇంజెక్షన్ తీసుకున్నట్లు అనుమానిస్తున్నట్లు తండ్రి పోలీసులకు తెలిపారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం వెంటనే సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















