మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని చౌదరిగూడలోని శ్రీనివాస కాలనీలో 400 గజాల పార్క్ స్థలాన్ని కబ్జాదారుల నుంచి హైడ్రా అధికారులు రక్షించారు. ఈ స్థలాన్ని లేఅవుట్ సమయంలో పార్క్ కోసం కేటాయించగా, దాన్ని అభివృద్ధి చేయకపోవడంతో కొందరు తప్పుడు పత్రాలతో కబ్జా చేశారు. కాలనీవాసులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదు. చివరకు హైడ్రా ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేయడంతో కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. కబ్జా నిజమని తేలడంతో శుక్రవారం అధికారులు పార్కులోని పిచ్చి మొక్కలను తొలగించి, చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. హైడ్రా చర్యలపై కాలనీవాసులు సంతృప్తి వ్యక్తం చేశారు.




















