గో రక్షణ కోసం తన ఆస్తిని అమ్మి కృషి చేస్తున్న యుగతులసి పార్టీ అధ్యక్షుడు శివకుమార్‌ను జూబ్లీహిల్స్‌లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియా సమావేశంలో ఈ అంశంపై మాట్లాడారు.
దేశంలో చట్టాలు పార్లమెంట్, అసెంబ్లీలలో రూపొందిస్తారని, కానీ గో రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఎందుకు రాలేదని ఆయన విమర్శించారు. దీనికి సంబంధించిన చట్టం తీసుకోవాల్సిన ప్రజాప్రతినిధులు పార్లమెంట్ ముందు కూడా అలాంటి ఆలోచనకు సాక్ష్యం ఇవ్వడంలేదని ఆయన పేర్కొన్నారు.
ఆవును దెబ్బతీసే చర్యలు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరించారు. గోమాతను రక్షించుకునే సంకల్పంతో పనిచేస్తున్న శివకుమార్‌కు జూబ్లీహిల్స్‌లోని ప్రజలు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి శివకుమార్, కృప శ్రీనివాస్, చంద్రస్వామి, స్వామి దయాశంకర్, రాజగోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.




















