వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ పాట స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని దేశమంతా వ్యాప్తి చేసిన మరియు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే నిత్య చైతన్య గేయంగా నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని, పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్లోని 500 మంది విద్యార్థులు భారతదేశ మ్యాపు మరియు వందేమాతరం@150 రూపంలో అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఈ స్ఫూర్తిదాయకమైన నిరంతర నినాదం (వందేమాతరం.. నినదిస్తాం నిరంతరం..) మరియు అద్భుత ప్రదర్శన చేసిన విద్యార్థులకు విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ తమ అభినందనలు తెలియజేశారు.


















