తమిళనాడులో రాజకీయాలు మరోసారి ఆసక్తికర మలుపు తిరిగాయి. అన్నాడీఎంకే బహిష్కృత నేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలైన వీకే శశికళ తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. ‘ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం’ అనే పేరుతో పార్టీ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పార్టీ గుర్తుగా కొబ్బరి చెట్ల సమూహంను ప్రకటించారు. ఈ గుర్తు ఐక్యత, బలానికి ప్రతీకగా ఉంటుందని ఆమె తెలిపారు.
పార్టీ స్థాపన సందర్భంగా శశికళ మాట్లాడుతూ.. తమ పార్టీ ఒక కుటుంబంలా పనిచేస్తుందని, ప్రజల సంక్షేమం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో తలెత్తిన పరిస్థితులపై కూడా ఆమె స్పందించారు. తాను ముఖ్యమంత్రిగా నియమించిన వ్యక్తి తనకు వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తూ, గత తొమ్మిదేళ్లుగా మౌనంగా ఉన్నానని తెలిపారు. ఇకపై మౌనంగా ఉండటం సాధ్యం కాదని, పార్టీ కార్యకర్తలు మరియు ప్రజల కోసం మళ్లీ రాజకీయాల్లో చురుకుగా పని చేస్తానని స్పష్టం చేశారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శశికళ పార్టీ ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ పార్టీ ఎన్నికలపై ఎంత ప్రభావం చూపుతుందో అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















